స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • తీవ్ర ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు
  • 26 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 16 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. లాభాలు, నష్టాల మధ్య ఊగిసలాడాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 26 పాయింట్లు నష్టపోయి 34,842కు చేరింది. నిఫ్టీ 16 పాయింట్లు కోల్పోయి 10,288 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ లిమిటెడ్ (5.45%), హీరో మోటోకార్ప్ (2.59%), బజాజ్ ఫైనాన్స్ (2.35%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.04%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.67%).

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-3.30%), ఇన్ఫోసిస్ (-2.04%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.71%), ఓఎన్జీసీ (-1.62%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.59%).


More Telugu News