బాహుబలి, భల్లాలదేవులకు మాస్కులు... అభినందించిన రాజమౌళి
- కరోనా రక్షణ జాగ్రత్తలపై గ్రాఫిక్స్ వీడియో
- మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్కులు తప్పనిసరి అంటూ సందేశం
- ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలన్న రాజమౌళి
ఇప్పుడు కరోనా కాలం నడుస్తోంది. మాస్కులు, శానిటైజర్లు నిత్యజీవితంలో భాగమయ్యాయి. ముఖ్యంగా మాస్కు ఓ కవచంలా కరోనా వైరస్ సోకకుండా కాపాడుతుందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రెండు గ్రాఫిక్స్ సంస్థలు వినూత్నంగా ప్రచారం చేయదలిచాయి. బాహుబలి చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి, భల్లాలదేవుడు ఫైటింగ్ సీన్లో మాస్కులు ధరించి పోరాడుతున్నట్టుగా గ్రాఫిక్స్ చేశారు. మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్కులు తప్పనిసరి అని, మీరు కూడా మాస్కులు ధరించడం మర్చిపోవద్దని ఆ గ్రాఫిక్స్ వీడియోలో పేర్కొన్నారు.
ఈ వీడియో ప్రయత్నాన్ని బాహుబలి దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో అభినందించారు. అవిటూన్ ఇండియా, కొల్లాజ్ యునైటెడ్ సాఫ్ట్ వీఎఫ్ఎక్స్ టీమ్ లు మంచి ప్రయత్నం చేశాయని మెచ్చుకున్నారు. కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, జాగ్రత్త చర్యలు తప్పకుండా పాటించాలని రాజమౌళి సూచించారు.