3టీ టోర్నీతో క్రికెట్ సందడికి శ్రీకారం చుట్టనున్న దక్షిణాఫ్రికా

  • ఈ నెల 18 నుంచి దక్షిణాఫ్రికాలో 3టీ టోర్నమెంట్
  • మూడు జట్లతో పోటీలు
  • ఒక్కో జట్టులో 8 మంది ఆటగాళ్లు
కరోనా వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచం స్తంభించడంతో క్రికెట్ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే పలు జట్లు క్రికెట్ సిరీస్ లకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాలో మళ్లీ క్రికెట్ ఊపందుకునే దిశగా 3టీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు.

 మూడు జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ నెల 18 నుంచి జరగనుంది. ఇందులో పాల్గొనే కైట్స్ జట్టుకు క్వింటన్ డికాక్, ఈగిల్స్ జట్టుకు ఏబీ డివిలియర్స్, కింగ్ ఫిషర్స్ టీమ్ కు కగిసో రబాడా నాయకత్వం వహిస్తారు. ఒక్కో జట్టులో 8 మంది ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ఈ టోర్నీ కోసం దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి ఆటగాళ్లు ఇప్పటినుంచే సాధన చేస్తున్నారు. 3టీ టోర్నీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందుల పాలవుతున్న వారికి అందిస్తారు.



More Telugu News