4,500‌ చైనా గేమ్స్‌ యాప్‌లను తొలగించి షాక్ ఇచ్చిన యాపిల్‌

  • కేవలం మూడు రోజుల వ్యవధిలో  భారీగా యాప్‌ల తొలగింపు
  • మొబైల్ గేమింగ్‌ లైసెన్స్‌ నింబంధనల్లో మార్పుల కారణంగా చర్య
  • చైనా సంస్థలకు తీవ్ర నష్టమంటోన్న నిపుణులు
చైనీస్‌ యాప్‌ స్టోర్‌లోని 4,500 మొబైల్‌ గేమ్స్‌ను తొలగిస్తూ యాపిల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గాల్వన్‌ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఇటీవలే 59 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బ నుంచి చైనా తేరుకోకముందే మరోవైపు యాపిల్‌ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కేవలం మూడు రోజుల వ్యవధిలో యాపిల్‌ ఇంత భారీగా యాప్‌లను తొలగించింది. మొబైల్ గేమింగ్‌ లైసెన్స్‌ నింబంధనల్లో యాపిల్ పలు సంస్కరణలకు చేపట్టింది. ఇందులో భాగంగానే యాపిల్‌ చైనా గేమ్స్‌ను‌ తొలగించింది. చట్టపరమైన అనుమతి లేని గేమ్స్‌ ను తాము ఉండనివ్వబోమని తేల్చి చెప్పింది.

లైసెన్స్‌ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు తాము గత ఏడాదే ప్రకటన చేసినట్లు యాపిల్ చెప్పింది. కావాలంటే తొలగించిన ఆ యాప్‌లను లైసెన్స్‌ నిబంధనలను తిరిగి పునరుద్ధించిన తర్వాత అప్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. యాపిల్‌ తీసుకున్న ఈ కఠిన చర్యలతో  చైనా సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.



More Telugu News