ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 345 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 93 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ మార్కెట్లలో గత ఐదు సెషన్లుగా కొనసాగుతున్న ర్యాలీకి ఈరోజు బ్రేక్ పడింది. ఈ నాటి ట్రేడింగ్ చివర్లో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఒడిగట్టడంతో... సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 345 పాయింట్లు నష్టపోయి 36,329కి పడిపోయింది. నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 10,705కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.06%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.45%), టాటా స్టీల్ (1.23%), ఐటీసీ (1.00%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-4.45%), ఏసియన్ పెయింట్స్ (-3.37%), మారుతి సుజుకి (-2.93%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.91%), ఇన్ఫోసిస్ (-2.49%).