ఒడిశాలో కొత్త రూల్.. వివాహాలు, అంత్యక్రియలకు కూడా అనుమతి తప్పనిసరి

  • పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
  • స్థానిక పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరి
  • ఫంక్షన్ హాళ్ల యజమానులు, మేనేజర్లపైనే బాధ్యత
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ఒడిశా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై పెళ్లిళ్లు, అంత్యక్రియలకు కూడా అనుమతి తప్పనిసరంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

తాజా నిబంధనల ప్రకారం.. వివాహానికి కానీ, అంత్యక్రియలకు కానీ ముందు స్థానిక పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, 50 మంది మించకుండా వివాహం, 20 మంది మించకుండా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ఫంక్షన్ హాళ్ల యజమానులు, మేనేజర్లపైనే ఉందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.


More Telugu News