పద్మాలయా సంస్థకు 50 ఏళ్లు... మహేశ్ బాబు స్పందన
- పద్మాలయా బ్యానర్ లో మరుపురాని చిత్రాలు చేసిన కృష్ణ
- తన సోదరులతో పద్మాలయా స్టూడియోస్ స్థాపించిన కృష్ణ
- 50 ఏళ్ల అద్భుత ప్రస్థానం అంటూ కొనియాడిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ అనగానే పద్మాలయా స్టూడియోస్ గుర్తొస్తుంది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్థాపించిన పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ లో అనేక మరపురాని చిత్రాలు వచ్చాయి. పద్మాలయా స్టూడియోస్ 50 ఏళ్ల ప్రస్థానంపై మహేశ్ బాబు స్పందించారు. ఐదు దశాబ్దాల కిందట మొదలైన పద్మాలయా స్టూడియోస్ అద్భుతమైన రీతిలో ప్రస్థానం సాగించిందని పేర్కొన్నారు.
స్టూడియోస్ వ్యవస్థాపక సభ్యులు, ఈ బ్యానర్లో తిరుగులేని వినోదాత్మక చిత్రాలు అందించడంలో కృషి చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని, వారి పట్ల ఎంతో గౌరవం కలుగుతోందని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. పద్మాలయా బ్యానర్ లో వచ్చిన మొదటి చిత్రం అగ్నిపరీక్ష. 1970 జూలై 10న ఈ చిత్రం రిలీజైంది. ఈ బ్యానర్ లో కృష్ణ తన సోదరులైన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఘట్టమనేని హనుమంతరావులతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు.