సీఎం అధికార నివాసంగా జయలలిత ఇల్లు?
- నివాసంలో కొంత భాగంలో జయ స్మారకం
- మిగిలిన భాగాన్ని సీఎం అధికారిక నివాసంగా మార్చే యోచన
- స్మారక చిహ్నం వద్దంటున్న స్థానికులు
తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతోంది. దివంగత జయలలిత నివాసాన్ని ముఖ్యమంత్రి అధికార నివాసంగా మార్చాలని భావిస్తోంది. జయ నివాసంలో అధిక భాగాన్ని స్మారక చిహ్నంగా కాకుండా... సీఎం నివాసంగా మార్చే యోచనలో ఉంది.
జయ నివాసాన్ని ఆమె స్మారక చిహ్నంగా మార్చాలనే ప్రభుత్వ ఆలోచనను సవాల్ చేస్తూ పోయస్ గార్డెన్ కస్తూరి ఎస్టేట్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. ఇంటిని జయ స్మారకంగా మారిస్తే... తమ ప్రాంతంలో రద్దీ పెరుగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని, దీంతో తమ ప్రశాంతతకు భంగం వాటిల్లుతుందని పిటిషన్ లో తెలిపారు.
పిటిషన్ ను విచారించిన జడ్జి మాట్లాడుతూ, పలువురు నాయకుల ఇళ్లను స్మారకాలుగా మార్చారని, ఇది అసాధారణమైన విషయం కాదని చెప్పారు. జనాలు గుంపులుగా గుమికూడతారనే వాదనను అంగీకరించలేమని అన్నారు. పిటిషన్ విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ మాట్లాడుతూ, జయ నివాసాన్ని సీఎం అధికారిక నివాసంగా మార్చే ఆలోచన ఉందనే విషయాన్ని తెలిపారు.