వారాంతంలో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు!
- 548 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 162 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- చతికిల పడిన ఇన్ఫోసిస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. వరుసగా మూడో రోజు లాభాలను ఆర్జించిన మార్కెట్లు... ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ తదితర బ్లూచిప్ కంపెనీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు లాభపడి 37,020కి పెరిగింది. నిఫ్టీ 162 పాయింట్లు ఎగబాకి 10,902 వద్ద స్థిరపడింది. నిన్న దూసుకుపోయిన ఇన్ఫోసిస్ షేర్లు ఈరోజు చతికిలపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (5.52%), టైటాన్ కంపెనీ (3.75%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.46%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.19%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.45%), నెస్లే ఇండియా (-1.23%), ఇన్ఫోసిస్ (-0.76%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.67%), యాక్సిస్ బ్యాంక్ (-0.14%).