వికాస్ దూబే ఒక్కసారిగా షాక్ కు గురై చనిపోయాడు... పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

  • ఇటీవల ఎనిమిదిమంది పోలీసులను చంపేపిన దూబే
  • దూబేను మట్టుబెట్టిన యూపీ పోలీసులు
  • దూబే శరీరంపై నాలుగు బుల్లెట్ గాయాలు
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇటీవలే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబేను ఎన్ కౌంటర్ లో కాల్చిచంపడం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను చంపేసి యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్ కు సవాల్ విసిరిన దూబేను పోలీసులు కొన్నిరోజుల వ్యవధిలోనే అంతమొందించారు.

ఉజ్జయిన్ లో అదుపులోకి తీసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ ను కాన్పూర్ తీసుకువస్తుండగా, వాహనం బోల్తాపడిందని, దాంతో పోలీసు కానిస్టేబుల్ నుంచి ఆయుధం లాక్కుని తమపైనే కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా, ఆ గ్యాంగ్ స్టర్ మృతి చెందాడన్నది పోలీసుల కథనం.

తాజాగా, వికాస్ దూబే పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. దూబే శరీరంపై నాలుగు బుల్లెట్ గాయాలున్నాయని, తీవ్ర రక్తస్రావం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. అయితే గాయాలతో పాటు ఒక్కసారిగా షాక్ తినడం వల్ల దూబే ప్రాణాలు విడిచాడని ఆ రిపోర్టులో వివరించారు.


More Telugu News