కరోనా వ్యాక్సిన్ పై సంచలన ప్రకటన చేసిన రష్యా మంత్రి

  • ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇమ్యూనిటీ పెరుగుతోంది 
  • వచ్చే నెలలో అందుబాటులోకి రావచ్చొని వ్యాఖ్యలు
  • తమ వ్యాక్సిన్ రెండు దశలు పూర్తిచేసుకుందన్న మంత్రి సలికోవ్
రష్యాలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి రుస్లాన్ సలికోవ్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఇప్పటివరకు తమ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో రెండు దశలను విజయవంతంగా పూర్తిచేసుకుందని అన్నారు.

 రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో తమ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇమ్యూనిటీ పెరుగుతోందని తెలిపారు. త్వరలోనే మూడవ దశ పరీక్షలు చేపడతామని చెప్పారు. బహుశా వచ్చే నెల నుంచి తమ వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని సలికోవ్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ రంగ సంస్థ గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ తయారుచేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల డేటాను రష్యన్ హ్యాకర్లు దొంగిలిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తుండడం తెలిసిందే. ఇప్పటికే దీనిపై బ్రిటన్ కూడా ఆరోపణలు చేసింది.


More Telugu News