బిర్యానీకి తగ్గని డిమాండ్.. అత్యధికంగా ఆర్డర్లు దానికే!
- వరుసగా నాలుగో ఏడాది బిర్యానీకే తొలి స్థానం
- బిర్యానీ డెలివరీ కోసమే 5.5 లక్షల ఆర్డర్లు
- ఆ తర్వాతి స్థానాల్లో బట్టర్ నాన్, మసాలా దోశ
- వివరాలు తెలిపిన స్విగ్గీ
కరోనా వైరస్ విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌లోనూ బిర్యానీకి భలే గిరాకీ వచ్చింది. హోటళ్లలో ఆర్డర్ చేసిన పదార్థాల్లో బిర్యానీకే అగ్రస్థానం దక్కింది. భోజన ప్రియులు వరుసగా నాలుగో ఏడాది కూడా అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారపదార్థాల్లో బిర్యానీకే తొలి స్థానం దక్కింది.
లాక్‌డౌన్ సమయంలో బిర్యానీ డెలివరీ కోసమే 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఆ తర్వాత బట్టర్ నాన్‌లు, మసాలా దోశలకు ఆర్డర్లు అధికంగా వచ్చాయి. వాటికి దాదాపు మూడున్నర లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో చాక్‌లెట్ లావా కేక్, గులాబ్ జాం నిలిచాయి.
లాక్‌డౌన్‌తో వేడుకలకు దూరంగా ఉన్న ప్రజలు పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకున్నారు. కొందరు కేక్ కట్ చేస్తూ వర్చువల్ పద్ధతిలో లైవ్‌లో బంధువులకు చూపారు. స్విగ్గీ స్టాట్ ఈట్ ఇస్టిక్స్ నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు.
లాక్‌డౌన్ సమయంలో ప్రజలు స్విగ్గీకి అధికంగా ఆర్డర్లు చేశారు. అన్ని వస్తువులు కలిపి మొత్తం 4 కోట్ల ఆర్డర్లను స్విగ్గీ డెలివరీ చేసింది. అంతేకాదు, 73,000 శానిటైజర్లు, హాండ్ వాష్ బాటిళ్లు, 47,000 ఫేస్‌మాస్క్‌లను కూడా స్విగ్గీ సరఫరా చేసింది. ప్రతిరోజు రాత్రి దాదాపు 65 వేల చొప్పున మీల్స్ ఆర్డర్లు వచ్చేవి.