షాలిని మెళ్లో మూడు ముళ్లు వేసిన హీరో నితిన్
- ఓ ఇంటివాడైన నితిన్
- ఇవాళ హైదరాబాదులో పెళ్లి
- హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
ఇన్నాళ్ల బ్రహ్యచర్యానికి స్వస్తి పలుకుతూ టాలీవుడ్ హీరో నితిన్ ఓ ఇంటివాడయ్యాడు. ఇవాళ హైదరాబాదులో నితిన్ వివాహం షాలినితో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి విచ్చేసిన అతిథులు వధూవరులను ఆశీర్వదించారు.. పెళ్లికొడుకుగా నితిన్, పెళ్లికూతురిగా షాలిని డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. నితిన్ ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయనేతలు కూడా హాజరయ్యారు.