అమెరికా ఎఫెక్ట్.. దూసుకుపోయిన మార్కెట్లు

  • యూఎస్ మరో స్టిమ్యులస్ ప్యాకేజీ ప్రకటించనుందని వార్తలు
  • బలపడ్డ ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • 558 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఆటో, ఐటీ, ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాల్లో పయనించాయి. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించబోతోందనే వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 558 పాయింట్లు లాభపడి 38,493కి పెరిగింది. నిఫ్టీ 168 పాయింట్లు ఎగబాకి 11,301కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (7.15%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (4.79%), టీసీఎస్ (4.76%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.58%), టెక్ మహీంద్రా (3.73%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.81%), నెస్లే ఇండియా (-1.29%), ఏసియన్ పెయింట్స్ (-1.21%), ఓఎన్జీసీ (-0.74%), ఐటీసీ లిమిటెడ్ (-0.38%).


More Telugu News