రాఫెల్ యుద్ధ విమానాల రాక.. చైనా, పాకిస్థాన్ లకు రాజ్ నాథ్ వార్నింగ్!

  • రాఫెల్ యుద్ధ విమానాలకు ఘన స్వాగతం పలికిన రాజ్ నాథ్
  • రాఫెల్ విమానాల రాకతో మరింత బలోపేతమైన వాయుసేన
  • శత్రు దేశాలు భయపడాల్సిందేనన్న రక్షణ మంత్రి
తొలి విడత రాఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత త్రివిధ దళాలలో కొత్త ఉత్సాహం నెలకొంది. శత్రు దేశాల యుద్ద విమానాలను తుత్తునియలు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న రాఫెల్ విమానాలతో మన సైనిక వ్యవస్థ శక్తిసామర్థ్యాలు అమాంతం పెరిగాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న ఐదు రాఫెల్ యుద్ధ విమానాలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్, పలువురు డిఫెన్స్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. జల ఫిరంగులతో రాఫెల్ జెట్లకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ... చైనా, పాకిస్థాన్ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. భారత సార్వభౌమాధికారాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటున్న వారు... భారత వాయుసేన శక్తిసామర్థ్యాలను చూసి భయపడాల్సిందేనని చెప్పారు.


More Telugu News