పాకిస్థాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ ఎందుకు అత్యుత్తమమో చెప్పిన వసీం అక్రం
- యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అక్రమ్
- ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం వస్తోందని వెల్లడి
- ఆ ఆదాయాన్ని బీసీసీఐ తిరిగి భారత క్రికెట్ కే వెచ్చిస్తోందని వివరణ
సాధ్యమైనంత వరకు భారత్ కు మద్దతుగా మాట్లాడే పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) కంటే ఐపీఎల్ టోర్నీయే అత్యుత్తమం అని పేర్కొన్నారు.
ఐపీఎల్ ఓ భారీ టోర్నీ అని, దానికోసం బీసీసీఐ ఎంతో ఖర్చు చేస్తోందని తెలిపారు. ఖర్చుకు తగిన స్థాయిలో ఐపీఎల్ కు విపరీతమైన ఆదాయం లభిస్తోందని, ఆ విధంగా వచ్చిన డబ్బును బీసీసీఐ తిరిగి క్రికెట్ కోసమే ఖర్చు చేస్తోందని, భారత్ లో దేశవాళీ క్రికెట్ కోసం వెచ్చిస్తున్నారని వివరించారు. ఈ కారణంగానే భారత దేశవాళీ క్రికెట్ నుంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారని అక్రమ్ అభిప్రాయపడ్డారు. కానీ పాకిస్థాన్ లో పీఎస్ఎల్ లో ఓ ఫ్రాంచైజీ కోసం ఖర్చు చేసే సొమ్ము ఎంతో తక్కువ అని వెల్లడించారు. ఆటగాళ్లను కొనుక్కునేందుకు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీకి రూ.80 కోట్ల బడ్జెట్ ఉంటుందని, పీఎస్ఎల్ ఫ్రాంచైజీల బడ్జెట్ ఆ దరిదాపుల్లో కూడా ఉండదని అక్రమ్ తెలిపారు.