చంపుతామని బెదిరింపులు వచ్చాయి.. పోలీసుల నుంచి స్పందన లేదు: ప్రొఫెసర్ నాగేశ్వర్
- గత నెల 25న బెదిరింపు కాల్స్ వచ్చాయి
- అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేశాను
- 12 రోజులైనా ఫిర్యాదుపై పురోగతి లేదు
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు బెదరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గత నెల 25న గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నాగేశ్వర్ కు ఇంటర్నెట్ బేస్డ్ వాయిస్ కాల్స్ వచ్చాయి. అదే రోజున నాగేశ్వర్ హాక్ ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
తాజాగా ఈ విషయంపై నాగేశ్వర్ మాట్లాడుతూ, తనను చంపుతానని గత నెల 25న ఓ ఆగంతుకుడు ఫోన్ చేశాడని తెలిపారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్నానని దూషించాడని చెప్పారు. ఈ విషయాన్ని డీజీపీ, కమిషన్ దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నించానని... అయితే వారు అందుబాటులోకి రాలేదని తెలిపారు. పోలీసులకు తాను ఫిర్యాదు చేసి 12 రోజులైనా... ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదని అన్నారు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే... సామాన్యుల పరిస్థితి ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు తాను బెదిరిపోనని... మరింత ఉత్సాహంతో ప్రజాసమస్యలను లేవనెత్తుతానని చెప్పారు.