వైద్యం అందక, భోజన వసతులు లేక రోడ్డు ఎక్కుతున్న కోవిడ్ బాధితుల ఆవేదన మీకు వినబడుతుందా జగన్ గారు?: దేవినేని ఉమ

  • కేసులు 2,27,860కి చేరుకోగా, మరణాలు 2 వేలు దాటాయి
  • యాక్టివ్ కేసుల్లో రెండోస్థానం
  • దేశ సగటు కంటే రాష్ట్రంలో మూడు రెట్ల కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజు అంతకంతకూ పెరిగిపోతోన్న కరోనా కేసుల పట్ల టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వసతులు కల్పించడంలోనూ ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన చెప్పారు.

'కేసులు 2,27,860కి చేరుకోగా, మరణాలు 2 వేలు దాటాయి. యాక్టివ్ కేసుల్లో రెండోస్థానం. దేశ సగటు కంటే రాష్ట్రంలో మూడు రెట్ల కేసులు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్న నిపుణులు. వారం రోజులుగా విజృంభణ. వైద్యం అందక, భోజన వసతులులేక రోడ్డు ఎక్కుతున్న కోవిడ్ బాధితుల ఆవేదన మీకు వినబడుతుందా వైఎస్‌ జగన్ గారు' అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కరోనా కేంద్రాల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తోన్న వారి వీడియోను ఆయన పోస్ట్ చేశారు.


More Telugu News