సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'చివరకు గెలిచేది టాలెంటే' అంటున్న రకుల్
- కామెడీ పాత్ర పోషిస్తున్న మీనా
- 11 భాషల్లో విడుదలవుతున్న వర్మ 'థ్రిల్లర్'
* 'ఏ రంగంలోనైనా సరే టాలెంట్ అనేదే చివరికి విజయం సాధిస్తుంది..' అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్ లో బంధుప్రీతి రాజ్యమేలుతోందన్న విమర్శల నేపథ్యంలో స్పందిస్తూ రకుల్ ఆ విధంగా చెప్పింది. 'ఇండస్ట్రీలోని వాళ్లయినా, బయటి వాళ్లయినా టాలెంట్ ఉంటేనే రాణిస్తారు. ప్రేక్షకులు నిన్ను ఇష్టపడుతున్నారా? లేదా? అన్నదానిపైనే నీ అదృష్టం ఆధారపడి వుంటుంది. కొందరికి అవకాశాలు త్వరగా రావచ్చు.. అంతమాత్రాన అది నీ అదృష్టాన్ని నిర్ణయిస్తుందంటే మాత్రం ఒప్పుకోను' అని చెప్పింది రకుల్.
* ఒకప్పటి ప్రముఖ కథానాయిక మీనా తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. 'కరోలిన్ కామాక్షి' పేరుతో రూపొందే ఈ వెబ్ సీరీస్ లో మీనా సీబీఐ ఆఫీసర్ గా కామెడీ పాత్రలో కనిపిస్తుందట. వచ్చే నెల నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.
* ఈ కరోనా సమయంలో రాంగోపాల్ వర్మ వరుసగా సినిమాలు తీసేస్తూ డిజిటల్ వేదికగా రిలీజ్ చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అప్సరా రాణి, రాక్ కచ్చి ప్రధాన పాత్రల్లో రూపొందించిన 'థ్రిల్లర్' చిత్రాన్ని ఈ నెల 14 నుంచి తన సొంత పోర్టల్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, దీనిని తెలుగుతో పాటు మొత్తం 11 భారతీయ భాషల్లో అనువదించారు.