కుమార్తెకు ఆస్తిలో సమాన హక్కుపై చంద్రబాబు ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన సంచయిత!

  • కుమార్తెకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంటుందంటూ సుప్రీం తీర్పు
  • సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • అశోక్ గజపతిరాజుకు చెప్పాలంటూ సంచయిత కౌంటర్
తల్లిదండ్రుల ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమాన హక్కు ఉంటుందంటూ ఈరోజు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ... సుప్రీంకోర్టు తీర్పు చాలా సంతోషకర విషయమని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు అన్న కూతురు, మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచయిత కౌంటర్ ఇచ్చారు.

'చంద్రబాబు గారూ... మహిళల పక్షపాతి అయిన మీరు... నాపై దాడి చేయవద్దని అశోక్ గజపతిరాజు గారికి చెప్పండి. నేను అశోక్ గజపతిరాజు అన్న ఆనంద గజపతిరాజు చట్టబద్ధ వారసురాలిననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను' అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.


More Telugu News