అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై సందిగ్ధత.. స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 37 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 14 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5 శాతం వరకు పెరిగిన హెచ్సీఎల్ టెక్నాలజీస్
గత కొన్ని సెషన్లుగా లాభాల్లో పయనిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. కరోనా దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా లా మేకర్లు అంగీకరిస్తారా? లేదా? అనే విషయంలో సందిగ్ధత ఉండటంతో... ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు నిస్తేజంగా ట్రేడ్ అవుతున్నాయి. దీని ప్రభావం మన దేశీయ మార్కెట్లపై కూడా పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 38,369కి చేరింది. నిఫ్టీ 14 పాయింట్లు కోల్పోయి 11,308 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.86%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.23%), టెక్ మహీంద్రా (2.57%), హీరో మోటో కార్ప్ (2.25%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.86%).
టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.10%), సన్ ఫార్మా (-1.67%), ఎల్ అండ్ టీ (-1.25%), బజాజ్ ఫైనాన్స్ (-1.10%), టీసీఎస్ (-0.99%).