సాయంత్రం చానల్ డిబేట్ లో పాల్గొంటానంటూ ట్వీట్ చేసి... హఠాన్మరణం చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ త్యాగి

  • రాజీవ్ త్యాగి గుండెపోటుతో మృతి
  • తీవ్ర విషాదంలో కాంగ్రెస్ వర్గాలు
  • నిజమైన దేశభక్తుడు అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్
జాతీయ స్థాయి చానళ్లలో కాంగ్రెస్ వాదనలను బలంగా వినిపించే నేతగా ఎంతో గుర్తింపు ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి హఠాన్మరణం చెందారు. ఆయన ఈ సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. త్యాగి మృతితో కాంగ్రెస్ వర్గాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. నిత్యం ఏదో ఒక చానల్ లో కాంగ్రెస్ వాణిని వినిపిస్తూ ఎంతో బిజీగా ఉండే రాజీవ్ త్యాగి ఈ సాయంత్రం 5 గంటలకు హిందీ న్యూస్ చానల్ 'ఆజ్ తక్' లో డిబేట్ లో పాల్గొంటున్నానని ట్వీట్ చేశారు. కానీ, ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణంపై కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. నికార్సయిన కాంగ్రెస్ వాది, నిజమైన దేశభక్తుడు అంటూ కొనియాడింది.

ఇక త్యాగి మరణవార్త విని బీజేపీ నేత సంబిత్ పాత్రా షాక్ అయ్యారు. 'ఈ సాయంకాలం 5 గంటలకు మేమిద్దరం కలసి ఆజ్ తక్ టీవీలో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇంతలోనే ఇలా అయిందంటే నమ్మలేకపోతున్నాను.. మాటలు రావడం లేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  


More Telugu News