తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
- ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
- హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలతోపాటు పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఉభయ వరంగల్ జిల్లాలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.