కరోనా టీకాకు పేటెంట్‌ హక్కులు పొందిన చైనా

  • క్యాన్‌సినో బయోలాజిక్స్‌ అభివృద్ధి చేసిన టీకా
  • బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకీ భాగస్వామ్యం
  • 'క్యాన్‌సినో' వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్‌ విజయవంతం
  • పేటెంట్ పొందిన తొలి సంస్థ క్యాన్‌సినో  
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే రేసులో చైనా దూకుడుగా ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన క్యాన్‌సినో బయోలాజిక్స్‌, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ కలిసి అభివృద్ధి చేసిన 'క్యాన్‌సినో'  వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్‌లోనూ మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ కొవిడ్ 19 టీకా Ad5-nCOV కు గానూ చైనా పేటెంట్ హక్కులు పొందింది.

ఆ దేశానికి చెందిన ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ రెగ్యులేటర్ వద్ద లభ్యమైన పత్రాల ఆధారంగా అక్కడి మీడియా ఈ వివరాలను తెలిపింది. కొవిడ్‌-19 టీకాకు పేటెంట్ పొందిన తొలి సంస్థ క్యాన్‌సినో అని, బీజింగ్‌ ఆ హక్కులను ఆగస్టు 11నే జారీ చేసిందని చెప్పింది. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ ఈ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ట్రయల్స్‌ కోసం పలు దేశాలతో చైనా చర్చలు జరుపుతోంది.


More Telugu News