ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు 

  • 173 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 69 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • నష్టపోయిన బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఐటీ, ఎనర్జీ, మెటల్ సూచీలు లాభాల్లో ట్రేడ్ కాగా... బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్లు లాభపడి 38,051కి పెరిగింది. నిఫ్టీ 69 పాయింట్లు పుంజుకుని 11,247 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (7.41%), బజాజ్ ఆటో (4.27%), హీరో మోటోకార్ప్ (4.17%), టెక్ మహీంద్రా (4.01%), ఓఎన్జీసీ (2.79%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.60%), భారతి ఎయిర్ టెల్ (-1.55%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.95%), సన్ ఫార్మా (-0.46%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.07%).


More Telugu News