లాభాలతో వారాన్ని ముగించిన మార్కెట్లు

  • 214 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 59 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • టాప్ గెయినర్ గా నిలిచిన ఎన్టీపీసీ
నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్ కంపెనీలలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినా... ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 214 పాయింట్లు లాభపడి 38,435కి చేరింది. నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 11,372 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (4.75%), ఏసియన్ పెయింట్స్ (4.43%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.39%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.56%), నెస్లే ఇండియా (2.02%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-1.34%), భారతి ఎయిర్ టెల్ (-1.05%), టాటా స్టీల్ (-0.81%), ఇన్ఫోసిస్ (-0.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.57%).


More Telugu News