సీతాకోక చిలుక మేజిక్.. వైరల్ అవుతోన్న వీడియో!
- షేర్ చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్
- బయటకు ఎండిపోయిన ఆకులా కనపడుతోన్న సీతాకోకచిలుక
- ఎగురుతోన్న సమయంలో మాత్రం రంగులు
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుస్వామి షేర్ చేసిన సీతాకోక చిలుకకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బయటకు ఎండిపోయిన ఆకులా కనపడుతోన్న ఈ సీతాకోక చిలుక ఎగురుతోన్న సమయంలో మాత్రం రంగురంగులతో కనపడుతూ అలరిస్తోంది. తన వద్దకు ఏదైనా పక్షి వచ్చి చంపాలని చూస్తే దాన్ని మభ్యపెట్టేలా ఈ సీతాకోకచిలుక తన రెక్కలను మూసుకుంటుంది.
దీంతో అది ఒక ఆకుగా భావించి ఇతర పక్షులు దానికి హాని తలపెట్టకుండా వెళ్లిపోతాయి. ఈ విధంగా సీతాకోకచిలుక తనను తాను రక్షించుకుంటోంది. మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నెన్ని అద్భుతాలు ఉంటాయో ఈ వీడియోను చూస్తే తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆసియాలోనే ఓ ప్రాంతంలో ఈ సీతాకోకచిలుక వీడియోను పరిశోధకులు తీశారు.