బ్యాంకుల జోరు.. వరుసగా ఐదో రోజు లాభాల్లో మార్కెట్లు!
- 40 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 10 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- ఆరున్నర శాతానికి పైగా పుంజుకున్న ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకుల అండతో మార్కెట్లు ఉదయం నుంచి భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 280 పాయింట్ల వరకు లాభపడింది. అయితే, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో లాభాలు కరిగిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 40 పాయింట్లు లాభపడి 39,113 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 11,559 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (6.59%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.80%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.81%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.62%), యాక్సిస్ బ్యాంక్ (2.08%).
టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-1.47%), బజాజ్ ఆటో (-1.23%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.18%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.11%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.72%).