అభిమానులకు షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా
- దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020
- వ్యక్తిగత కారణాలతో భారత్‌కు రాక
- ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్
- చెన్నై సూపర్ కింగ్స్‌ను కలవరపెడుతున్న కరోనా
దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020 నుంచి తప్పుకుని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు సురేశ్ రైనా షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ సీజన్‌కి దూరమవుతున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
ఆయన దుబాయి నుంచి భారత్‌కు వెనక్కి వచ్చేశారని తెలిపింది. ఆయన ఏ కారణం వల్ల తప్పుకోవాల్సి వచ్చిందనే విషయంపై మాత్రం ఆ టీమ్ స్పష్టత ఇవ్వలేదు. 'ఈ సమయంలో సురేశ్ రైనాతో పాటు ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటాం' అని మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కేఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు.
కాగా, ఇటీవలే సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆడడానికి ఇప్పటికే ఆయా జట్లు దుబాయికి చేరుకున్నాయి. కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌లో కొంతమందికి కరోనా సోకిందంటూ వచ్చిన వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా దుబాయి నుంచి వస్తుండడం గమనార్హం. సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో సీఎస్కే తలపడాల్సి ఉంది.