కరోనా వైరస్ మనకెన్నో కొత్త విషయాలు నేర్పింది: కేంద్రమంత్రి హర్షవర్ధన్
- దీపావళి నాటికి నియంత్రణలోకి
- ఈ ఏడాది చివరినాటికి టీకా
- జీవన శైలిలో మార్పుల ద్వారా వైరస్‌కు దూరంగా ఉండొచ్చు
కరోనా వైరస్ మనకెన్నో కొత్త విషయాలు నేర్పిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. అనంత్‌కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషన్ ఫస్ట్’ వెబ్ సెమినార్లో మంత్రి మాట్లాడుతూ.. దీపావళి నాటికి వైరస్ నియంత్రణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఈ ఏడాది చివరి నాటికి కరోనాను సమర్థంగా ఎదుర్కొనే టీకా రెడీ అవుతుందన్నారు. వైరస్ కారణంగా జీవితంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవాల్సి వచ్చిందని, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దాని నుంచి దూరంగా ఉండొచ్చని అన్నారు. కొంతకాలానికి మిగిలిన వైరస్ల మాదిరిగానే కరోనా కూడా ఓ సమస్యగా మిగిలిపోతుందని హర్షవర్ధన్ పేర్కొన్నారు.