రాజకీయం చేద్దామనుకున్న రౌడీషీటర్.. పోలీసులను చూసి పరార్!

  • తమిళనాడు బీజేపీ చీఫ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరికల కార్యక్రమం
  • బీజేపీలో చేరేందుకు వచ్చిన రౌడీషీటర్
  • రౌడీషీటర్ పై 35కి పైగా కేసులు
చెన్నైలో ఆసక్తికర సంఘటన జరిగింది. తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్.మురుగున్ ఆధ్వర్యంలో పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. చెంగల్పట్టు జిల్లాకు చెందిన సూర్య అనే రౌడీషీటర్ కూడా బీజేపీలో చేరేందుకు అనుచరగణంతో విచ్చేశాడు. అతడిపై అనేక కేసులు ఉండడంతో పోలీసులు కూడా వచ్చారు.

ఇక పార్టీ కండువా కప్పుకునేందుకు వేదికపైకి సూర్య చేరుకోగా, పోలీసులు వేదికను చుట్టుముట్టారు. దాంతో కండువా సంగతి పక్కనబెట్టి, సూర్య కాలికి బుద్ధిచెప్పాడు. పాపం, అతని అనుచరులు పోలీసులకు దొరికిపోయారు కానీ, సూర్య మాత్రం పారిపోయాడు. సూర్యపై చెంగల్పట్టు జిల్లాలో 35కి పైగా కేసులున్నాయట. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ మురుగన్ మాట్లాడుతూ, పార్టీలో చేరేందుకు ఎంతోమంది వస్తుంటారని, వారిలో చాలామంది నేపథ్యం తెలియదని వ్యాఖ్యానించారు.


More Telugu News