సినీ మాఫియా అసలు నేరస్తుడు కరణ్ జొహారే!: కంగనా ఫైర్

  • రాజ్ పుత్ మరణం తర్వాత తీవ్రస్థాయిలో స్పందిస్తున్న కంగనా
  • బాలీవుడ్ బంధుప్రీతిపై వ్యాఖ్యలు
  • కరణ్ అనేకమంది జీవితాలు నాశనం చేశాడంటూ ఆగ్రహం
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తన గళంలో పదును పెంచిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి కరణ్ జొహార్ పై నిప్పులు చెరిగారు. సినీ మాఫియాకు సంబంధించి అసలు నేరస్తుడు కరణ్ జొహారేనని మండిపడ్డారు.

అనేకమంది జీవితాలను, కెరీర్లను నాశనం చేసిన తర్వాత కూడా అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకునేది జరిగే పనేనా? అంటూ ఆమె వ్యాఖ్యానించారు. 'ఈ వ్యవహారం అంతా సద్దుమణిగాక కరణ్, క్రూరమృగాల వంటి అతని గ్యాంగ్ సభ్యులు నావైపు దృష్టి సారిస్తారు' అంటూ కంగనా ట్వీట్ చేశారు.

సుశాంత్ రాజ్ పుత్ తో కలిసి జిమ్ లో కసరత్తులు చేసే ఓ వ్యక్తి మీడియాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కంగనా పైవిధంగా స్పందించారు. ఆమె ఇప్పటికే బాలీవుడ్ లో బంధుప్రీతి అంశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


More Telugu News