ఈ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా విలయతాండవం!
- రోజుకు 70 వేలకు పైగా కేసులు
- మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకలో అత్యధికం
- తమిళనాడు, యూపీలో కూడా
భారతావనిలో రోజుకు 70 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. అంతేకాదు... కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగడం లేదని, కేవలం ఐదు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కొత్త కేసులు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా వ్యాధి బారిన పడుతున్న వారిలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వాసులే అధికమని, మొత్తం కేసులలో 56 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచి వస్తున్నాయని వెల్లడించింది.
ఇదే సమయంలో కోలుకుంటున్న వారిలో 58 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని, మరణాలు సైతం ఇక్కడే అధికంగా సంభవిస్తున్నాయని వైద్య శాఖ వెల్లడించింది. మంగళవారం నాడు దేశంలో 819 మంది చనిపోగా, అందులో 536 మంది ఈ ఐదు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇదే సమయంలో రికవరీ రేటు 77 శాతం వరకూ ఉండటం, యాక్టివ్ కేసులతో పోలిస్తే, చికిత్స తరువాత రికవరీ అయిన వారి సంఖ్య 3.61 రెట్లు అధికంగా ఉండటం ఒకింత ఉపశమనాన్ని కలిగిస్తోంది.