జగన్ వల్లే ఏపీకి మొదటి స్థానం దక్కింది: మంత్రి మేకపాటి
- సులభతర వాణిజ్య విభాగంలో అగ్రస్థానం
- ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు
- సింగిల్ డెస్క్ పోర్టల్‌లో పరిశ్రమలకు భూ కేటాయింపులు
- వాణిజ్య వివాదాలకు ఈ ఫైలింగ్ సౌకర్యం
రాష్ట్రాల వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకులను ఈ రోజు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సులభతర వాణిజ్య విభాగంలో ఏపీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. దీనిపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్ చర్యల వల్లే ఏపీకి అగ్రస్థానం దక్కిందని చెప్పారు.
కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలకు తమ సర్కారు తోడ్పాటునిచ్చిందని మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. పరిశ్రమలు మళ్లీ గాడినపడేలా ఆర్థిక తోడ్పాటును అందించారని చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారుల్లో ఏపీకి ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించిందని చెప్పారు.
ఏపీ సింగిల్ డెస్క్ పోర్టల్‌లో పరిశ్రమలకు భూ కేటాయింపులు ఇస్తున్నామని, అలాగే వాణిజ్య వివాదాలకు ఈ ఫైలింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. మురోవైపు విజయవాడ, విశాఖపట్నంలో వాణిజ్య వివాదాలకు ప్రత్యేక కోర్టు ఉందని అన్నారు. ఔషధాల విక్రయ లైసెన్స్ ఆన్‌లైన్‌లోనే పొందే సౌకర్యం కల్పించామని, ఏటా రెన్యువల్ చేసుకునే అవసరం లేకుండా షాపులకు మినహాయింపులు ఇచ్చామని చెప్పారు.