కేశవానంద భారతి శివైక్యం
- కేరళలోని ఎడనీర్ మఠంలో కన్నుమూత
- కేరళ భూసంస్కరణ చట్టంపై 1973లో పోరాడిన స్వామీజీ
- కేరళ ప్రభుత్వంపై అలుపెరగని న్యాయ పోరాటం
కేరళలోని ఎడనీర్ మఠంలో ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి (79) శివైక్యం చెందారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన కేరళ భూసంస్కరణ చట్టంపై 1973లో ఎనలేని పోరాటం చేశారు. 1973లో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేరళ ప్రభుత్వంపై ఆయన వేసిన ఈ కేసును 13 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.
రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సుప్రీంకోర్టు సంరక్షణదారని తీర్పునిచ్చింది. ఈ కేసులో విచారణ 68 రోజుల పాటు విచారణ జరిగింది. కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన మఠాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఆయన ఈ తీరును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా విశ్లేషకులు అంటుంటారు. ఈ కేసులో కేశవానంద భారతికి అనుకూలంగా తీర్పు వచ్చింది.