కులధ్రువీకరణ పత్రం లేకుండానే.. నాలుగు కులాలకు వైయస్సార్ చేయూత పథకం వర్తింపు

  • కులధ్రువీకరణ పత్రాలు పొందడంలో నాలుగు కులాలకు ఇబ్బందులు
  • అర్హత ఉన్నా లబ్ధి పొందలేకపోతున్న వైనం
  • స్పందించిన సీఎంవో కార్యాలయం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 మధ్య వయసున్న మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు వైయస్సార్ చేయూత పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, నాలుగు కులాల వారు పలు కారణాల వల్ల కులధ్రువీకరణ పత్రాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వాల్మీకి, బుడగజంగం, ఏనేటి కొంద్, బెంతొ ఒరియా కులాల వారికి కులధ్రువీకరణ పత్రం లేకుండానే చేయూత పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించింది. కులధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల పలువురు అర్హులు లబ్ధి పొందలేకపోయారనే విషయాన్ని ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో పలువురు మంత్రులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీఎంఓ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.


More Telugu News