అమెరికాలో జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడి.. కృష్ణా జిల్లా యువతి మృతి

  • బాధితురాలిది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు
  • బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
  • నాట్స్ సహకారంతో మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు
జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జారిపడి అమెరికాలో కృష్ణా జిల్లా యువతి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు కమల (26) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు.

ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్న ఆమె శనివారం బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సహకారంతో కమల మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.


More Telugu News