గత 24 గంటల్లో తెలంగాణలో... 50 వేలకు పైగా టెస్టులు చేస్తే, 2,043 కేసుల నమోదు!

  • 1.67 లక్షలను దాటిన మొత్తం కేసులు
  • గురువారం నాడు 11 మంది కన్నుమూత
  • మరణాల రేటు 0.60 శాతమేనన్న ప్రభుత్వం
తెలంగాణలో గడచిన 24 గంటల వ్యవధిలో 50,634 మంది నమూనాలను పరీక్షించగా, 2,043 కరోనా కేసులు వచ్చాయని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కు చేరింది. గురువారం నాడు 1,802 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,35,357కు పెరిగిందని వెల్లడించింది.

ఇక గురువారం నాడు 11 మంది వైరస్ కారణంగా మరణించారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,016కు పెరిగిందని, ఇండియాలో మరణాల రేటు 1.61 శాతం కాగా, తెలంగాణలో అది 0.60 శాతం మాత్రమేనని పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 30,673 కాగా, గృహ/ సంస్థల ఐసొలేషన్ లో 24,081 మంది ఉన్నారని వెల్లడించింది.

రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మంది జనాభాలో ఇప్పటికే 64,104 మందికి కరోనా పరీక్షలు చేశామని, మరో 1,039 మంది తమ టెస్ట్ రిపోర్టు కోసం నిరీక్షిస్తున్నారని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన అధికారిక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,950 సాధారణ పడకలు, 4,470 ఆక్సిజన్ పడకలు, 1,532 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 


More Telugu News