బాలు పరిస్థితి విషమించిన నేపథ్యంలో హుటాహుటీన ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లిన కమలహాసన్
- బాలు పరిస్థితి అత్యంత విషమం
- బులెటిన్ విడుదల చేసిన ఎంజీఎం డాక్టర్లు
- బాలు తనయుడితో మాట్లాడిన కమల్
సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. గత 24 గంటల్లో బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందని చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలు పరిస్థితి క్షీణించిందన్న సమాచారంతో నటుడు కమలహాసన్ హుటాహుటీన ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. బాలు ప్రస్తుత పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. బాలు తనయుడు ఎస్పీ చరణ్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కమల్ ఎంజీఎం ఆసుపత్రికి వచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇస్తోంది.