మా చిన్న మేనమామ యుగంధరే నా భర్తను చంపాడు: హేమంత్ భార్య
- ప్రణయ్-అమృతల విషయంలో ఇటువంటి ఘటనే జరిగింది
- అయినా నా తండ్రి ఆలోచించకుండా ప్రవర్తించాడు
- ప్రణయ్‌ను చంపించిన మారుతీరావు ఏమయ్యాడు?
- నన్ను వదిలేసి ఉంటే నా బతుకు నేను బతికేదాన్ని
హైదరాబాద్‌లోని చందానగర్ లో నివాసముంటోన్న హేమంత్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అవంతి అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులే హేమంత్‌ను హత్య చేయించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అవంతి మీడియాతో మాట్లాడింది. తన చిన్న మేనమామ యుగంధర్ ఈ హత్య చేశాడని చెప్పింది.
నిన్న మధ్యాహ్నం తనను, తన భర్తను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి బలవంతంగా కారులో కిడ్నాప్ చేశారని, ఓఆర్ఆర్ వద్ద భయంతో తాము కారు బయటికి దూకేసి పరుగులు తీశామని తెలిపింది. అయితే, దుండగులు హేమంత్‌ను పట్టుకుని కారులో పడేసి తీసుకెళ్లిపోయారని, తాను తన తండ్రికి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదని చెప్పింది. తమ పెళ్లి జరిగి మూడు నెలలు అవుతోందని, తన తల్లిదండ్రులు తమ పెళ్లి పట్ల ఆగ్రహంతో ఉన్నారని చెప్పింది.
తనను తిరిగి ఇంటికి వచ్చేయాలని చెప్పారని, మళ్లీ పెళ్లి చేస్తామని అన్నారని తెలిపింది. హేమంత్‌కు ఆస్తులు లేవని వారు చెప్పారని పేర్కొంది. ప్రణయ్-అమృతల విషయంలో ఇటువంటి ఘటనే జరిగినప్పటికీ తన తండ్రి ఆలోచించకుండా ప్రవర్తించారని చెప్పింది. చివరకు ప్రణయ్‌ను చంపించిన మారుతీరావు ఏమయ్యాడని ఆమె నిలదీసింది. తనను వదిలేసి ఉంటే తాను తన బతుకు తాను బతికేదాన్నని చెప్పుకొచ్చింది.