'నా స్వరం మీరే'నన్న రజనీకాంత్.. 'దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా' అంటున్న నాగార్జున!
- బాలు మరణంతో షాక్ కు గురైన చిత్రసీమ
- భావోద్వేగానికి గురవుతున్న సినీ ప్రముఖులు
- మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో ఉంటాయన్న రజనీ
తన గానంతో కోట్లాది మందిని పులకింపజేసిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. మీ వంటి మహోన్నతమైన గాయకుడు మళ్లీ పుట్టడని కంటతడి పెడుతోంది. బాలు సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. 'ఎన్నో ఏళ్లుగా నా స్వరం మీరే' అని ట్వీట్ చేశారు. మీ స్వరం, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో ఉంటాయని అన్నారు.
అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. బాలుగారితో గడిపిన క్షణాలన్నీ గుర్తుకొస్తున్నాయని, కళ్లు చెమ్మగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'అన్నమయ్య' సినిమా తర్వాత ఆయన నుంచి తనకు వచ్చిన ఫోన్ కాల్ ఇప్పటికీ గుర్తుందని చెప్పారు. తన జీవితంలో బాలు ఒక భాగమని అన్నారు. 'దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో' అని నాగార్జున ట్వీట్ చేశారు.