కేసీఆర్ సెక్రటరీగా వి.శేషాద్రి నియామకం
- ఐదున్నరేళ్లు పీఎంవోలో పని చేసిన శేషాద్రి
- కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన సీనియర్ అధికారి
- రెవెన్యూ చట్టాల సమీక్ష బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి వి.శేషాద్రి నియమితులయ్యారు. గత ఐదున్నరేళ్లుగా ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయన బాధ్యతలను నిర్వర్తించారు. కేంద్రంలో సర్వీసును పూర్తి చేసుకుని కొన్ని రోజుల క్రితమే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన రాగానే కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు రెవెన్యూ చట్టాల సమీక్ష బాధ్యతలను అప్పగించింది. సీఎం సెక్రటరీగా ఆయన బాధ్యతలను నిర్వహించనున్నారు.
1999 బ్యాచ్ కు చెందిన శేషాద్రి బెంగళూరులోని నేషనల్ స్కూల్ ఆఫ్ లా నుంచి పట్టభద్రుడయ్యారు. రెవెన్యూ చట్టాలపై ఆయనకు గట్టి పట్టు ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆయన పని చేశారు. యూఎల్సీ ప్రత్యేక అధికారిగా కూడా పని చేశారు.