నూతన రెవెన్యూ చట్టం గురించి గవర్నర్ తమిళిసైకి వివరించిన సీఎం కేసీఆర్
- మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
- రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ
- కరోనా సహా ఇటీవలి పరిణామాలపై చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నుంచి ఇటీవల తాము తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం వరకు అనేక అంశాలను ఆమెకు వివరించారు.
దసరా నుంచి సరికొత్త రెవెన్యూ విధానం అమలు, ధరణి పోర్టల్ ప్రారంభం, వ్యవసాయేతర ఆస్తుల నమోదు విధివిధానాల పట్ల ఆయన గవర్నర్ తో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీతో జలవివాదాలపైనా ఇరువురి మధ్య ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు కలిగే నష్టాలు, ఈ నెల మొదటివారంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండా తదితర అంశాలను కూడా సీఎం కేసీఆర్ గవర్నర్ కు వివరించారు.