ప్రభాస్ తో పెళ్లి సీన్ ఫొటో పోస్ట్ చేసి, అనుష్కను ప్రశ్నించిన అభిమాని!
- ఇటీవలే ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన అనుష్క
- పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు
- అవకాశం వస్తే మరో చిత్రంలో ప్రభాస్ తో నటిస్తానన్న స్వీటీ
సౌతిండియా బ్యూటీ అనుష్క, ఇటీవల ట్విట్టర్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తరచూ తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తూనే ఉంది. తాజాగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానంటూ, ఓ సెషన్ ను అనుష్క నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమెకు పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. చాలా ప్రశ్నలు ప్రభాస్ తో ముడిపెడుతూనే రాగా, అనుష్క తనదైన శైలిలో తెలివైన సమాధానాలను ఇచ్చింది.
ఓ అభిమాని, "ప్రభాస్ తో మీ జోడీ బాగుంటుంది. ప్రతి ఒక్కరూ మీ జంటను ఇష్టపడతారు. మరో మూవీ చేయండి" అని కోరగా, "ఏదైనా కథకు తన అవసరం ఉందని వస్తే, నేను తప్పకుండా ప్రభాస్ తో ఇంకో సినిమా చేస్తాను. మీరంతా మా జంటపై ఎంతో ప్రేమను చూపిస్తారని తెలుసు. అందుకు కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించింది. ఆపై మరో అభిమాని, ప్రభాస్, అనుష్కలకు వివాహం జరుగుతున్న సినిమా పిక్ ను పోస్ట్ చేస్తూ, దీనికి సమాధానం చెప్పాలని కోరాడు.
దీనికి సమాధానం ఇస్తూ, "ఇది ఓ సినిమా కోసం తీసిన చిత్రం. షాట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది 'మిర్చి' సినిమాలోనిది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నా మనసుకు ఎంతో నచ్చిన చిత్రాల్లో ఒకటి. ఓ అందమైన పోస్టర్" అని చెప్పింది. కాగా, అనుష్క నటించిన తాజా చిత్రం 'నిశ్శబ్దం' ఇటీవలే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.