పవన్ కల్యాణ్ పిలుపు కోసం ఎంతో ఎదురుచూశా: హర్షకుమార్
- జనసేన పార్టీలో చేరాలనుకున్నా
- తనను కలిసేందుకు పవన్ వస్తారనే సమాచారం కూడా అందింది
- ఎందువల్లో ఆయన నా దగ్గరకు రాలేదు
తాను జనసేన పార్టీలో చేరాలనుకున్నానని... ఆ కారణం వల్లే తన వర్గం నుంచి ఎంతో మందిని ఆ పార్టీలోకి పంపించానని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు జనసేనాని పవన్ కల్యాణే వస్తారని తనకు సమాచారం అందిందని... ఆ తర్వాత ఏమైందో కానీ పవన్ తన వద్దకు రాలేదని చెప్పారు. పవన్ పిలుపు కోసం ఎంతో ఎదురుచూశానని తెలిపారు. ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ గురించి కూడా హర్షకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడానికి తానే కారణమని చెప్పారు. ఈ కారణం వల్లే పవన్ ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయినట్టున్నారని... అందుకే తనను జనసేనలో చేర్చుకోలేదని అన్నారు.