'అవును' సినిమా హీరోకు కరోనా పాజిటివ్

  • కరోనా బారినపడిన హర్షవర్ధన్ రాణే
  • జ్వరం, కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన రాణే
  • ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడి
టాలీవుడ్ లోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును' చిత్రంలో హీరోగా నటించిన హర్షవర్ధన్ రాణే కూడా కరోనా బారినపడ్డాడు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని హర్షవర్ధన్ రాణే స్వయంగా వెల్లడించాడు.

జ్వరం, కడుపునొప్పి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించారని తెలిపాడు. కరోనా సోకినట్టు ఆ పరీక్షల్లో తేలిందని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని హర్షవర్ధన్ రాణే వివరించాడు. 10 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నానని పేర్కొన్నాడు.

హర్షవర్ధన్ రాణే 'అవును' చిత్రంతో పాటు అవును సీక్వెల్ లోనూ నటించాడు. శేఖర్ కమ్ముల హిట్ చిత్రం 'ఫిదా'లో కూడా కనిపించాడు. బాలీవుడ్ లోనూ ప్రవేశించిన ఈ నటుడు 'తేయిష్' అనే చిత్రంలో నటించాడు. ఈ నెలాఖరులో ఆ చిత్రం ఓటీటీ వేదికగా రిలీజ్ కానుంది.


More Telugu News