1993లో హీరోయిన్ శ్రుతి హాసన్ ఇలా ఉండేది!

  • పాఠశాలలో చదువుకుంటోన్న సమయంలో శ్రుతి ఫొటోలు
  • 1993లో బొమ్మపై కూర్చొని ఆడుకున్న శ్రుతి
  • ప్రస్తుతం ‘క్రాక్‘, ‘వకీల్ సాబ్’ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్
హీరోయిన్ శ్రుతి హాసన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన చిన్ననాటి ఫొటోలను పోస్ట్ చేసింది.  తాను పాఠశాలలో చదువుకుంటోన్న సమయంలో తన స్నేహితులతో కలిసి తీసుకున్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తన స్నేహితుల మధ్య కూర్చొని ఉంది.  ఫొటోలో తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.  
               అలాగే,  1993లో తాను ఆడుకుంటోన్న సమయంలో కోతి బొమ్మపై కూర్చొని తీసుకున్న మరో ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది. కమల హాసన్ కూతురిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాది సినిమాల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘క్రాక్‘, ‘వకీల్ సాబ్’ సినిమాల్లో నటిస్తూనే తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేస్తోంది.



More Telugu News