ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై చెప్పులు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు.. వీడియో ఇదిగో

  • బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఘటన
  • ఔరంగాబాద్‌ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న తేజస్వీ
  • రెండు చెప్పులు దూసుకొచ్చిన వైనం
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. బీహార్ లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఓ సమావేశం నిర్వహించగా ఆ పార్టీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌పై కొందరు చెప్పులు విసరడంతో కలకలం రేగింది.  

ఔరంగాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో తేజస్వీ పాల్గొని, వేదికపై కూర్చున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేదికపై తేజస్వీ పక్కన మరికొందరు నేతలు కూడా కూర్చున్నారు. ఆ సమయంలో కొందరు రెండు చెప్పులను విసిరారు. ఒక చెప్పు తేజస్వీ మీదపడగా, మరో చెప్పు ఆయన తల పక్క నుంచి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు దొరికింది.

తనపై చెప్పులు విసిరిన ఘటనపై తేజస్వీ స్పందించలేదు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్‌ తివారీ మాత్రం ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. తమ నేతల ప్రచార సమయంలో వారికి సరైన భద్రత ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News