రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

  • కార్పొరేషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
  • గత కొన్ని రోజులుగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించని కార్పొరేషన్
  • హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పర్యవేక్షణలో కడప స్టీల్ ప్లాంట్
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పర్యవేక్షణలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపింది. గత టీడీపీ హయాంలో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరిట కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి మధుసూదన్ ను తాత్కాలిక సీఎండీగా నియమించారు. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు.


More Telugu News