భర్తతో కలిసి వీడియో.. దసరా శుభాకాంక్షలు తెలిపిన యాంకర్ సుమ

  • చిరునవ్వులు చిందించిన సుమ దంపతులు
  • దసరా శుభాకాంక్షలు తెలిపిన పలువురు యాంకర్లు
  • శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్న ఉదయభాను
  • దసరా శుభాకాంక్షలు చెప్పిన అనసూయ
దసరా సందర్భంగా తన అభిమానులకు యాంకర్ సుమ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆమె తన భర్తతో కలిసి కనపడింది. సుమకు భర్తతో విభేదాలు వచ్చాయంటూ కొన్ని నెలల క్రితం ప్రచారం జరిగింది. వాటన్నింటినీ తోసిపుచ్చేలా ఇప్పటికే సుమ పలు ఫొటోలు పోస్ట్ చేసింది. దసరా సందర్భంగా భర్త రాజీవ్ కనకాల చేతిని పట్టుకుని వీడియో తీసుకుంది. ‘అందరికీ దసరా..’ అని సుమ అంది.. ఆ వెంటనే ‘శుభాకాంక్షలు’  అని రాజీవ్ కనకాల చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చిరునవ్వులు చిందించారు.

కాగా, దసరా సందర్భంగా యాంకర్ ఉదయభాను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ‘దసరా సందర్భంగా దుర్గమ్మ తల్లి దయ మీపై పడాలని, మీకు శక్తిని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాపై ఎంతో ప్రేమను చూపెడుతున్న వారందరికీ కృతజ్ఞతలు’ అని ఉదయభాను తెలిపింది. యాంకర్ అనసూయ కూడా కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది.


More Telugu News